డాక్టర్ శాంతారావుకు జీవన సాఫల్య పురస్కారం
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:52 AM
ప్రముఖ శస్త్ర చికిత్స వైద్య నిపుణుడు డాక్టర్ జి.శాంతారావుకు భారత శస్త్రచికిత్స వైద్యుల సంఘం (అసోసియేషన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా) జీవన సాఫల్య పురస్కారం (లై్‌ఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు) ప్రదానం చేసింది.
మహారాణిపేట, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ శస్త్ర చికిత్స వైద్య నిపుణుడు డాక్టర్ జి.శాంతారావుకు భారత శస్త్రచికిత్స వైద్యుల సంఘం (అసోసియేషన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా) జీవన సాఫల్య పురస్కారం (లై్‌ఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు) ప్రదానం చేసింది. శుక్రవారం గుంటూరులో జరిగిన స్టేట్ చాప్టర్ కాన్ఫరెన్స్‌లో డాక్టర్ శాంతారావుకు జీఎస్‌ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, డాక్టర్ లక్ష్మణ ప్రసాద్‌లు ఈ పురస్కారాన్ని అందించారు. డాక్టర్ జి.శాంతారామ్ కేజీహెచ్‌లో శస్త్రచికిత్స నిపుణుడిగా, సూపరింటెండెంట్‌గా, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా గతంలో పనిచేశారు. అక్కడ నుంచి రాష్ట్ర వైద్య విద్య సంచాలకునిగా అనేక సేవలందించారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు.