Share News

డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ ఎం.హైమావతి బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:33 AM

అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణిగా డాక్టర్‌ ఎం.హైమావతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె విశాఖ నుంచి అనకాపల్లికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించిన బాలాజీ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు.

డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ ఎం.హైమావతి బాధ్యతల స్వీకరణ
డాక్టర్‌ హైమావతి

అనకాపల్లి టౌన్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణిగా డాక్టర్‌ ఎం.హైమావతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె విశాఖ నుంచి అనకాపల్లికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించిన బాలాజీ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ జిల్లాలో మాతాశిశు మరణాలను తగ్గిస్తామన్నారు. మలేరియా, పైౖలేరియా, డెంగ్యూ, డయేరియా తదితర సీజనల్‌ వ్యాధులు రాకుండా పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది సహకారంతో కృషి చేస్తామని చెప్పారు.

Updated Date - Jul 03 , 2025 | 12:33 AM