డీఎంహెచ్‌వోగా డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:59 AM
స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా ఉన్న ఆయనకు పదోన్నతి కల్పించి ఇక్కడ డీఎంహెచ్‌వోగా నియమించింది. కాగా ఇక్కడ డీఎంహెచ్‌వోగా పని చేసిన డాక్టర్ సి.జమాల్ బాషా ఈ ఏడాది మార్చిలో కడప బదిలీ కాగా, అప్పటి నుంచి జిల్లా అంధత్వ నివారణ సంస్థ డీపీఎం డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు డీఎంహెచ్‌వోగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
- గుంటూరు జీజీహెచ్ డీసీఎస్‌కు పదోన్నతి కల్పించి నియామకం
పాడేరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా ఉన్న ఆయనకు పదోన్నతి కల్పించి ఇక్కడ డీఎంహెచ్‌వోగా నియమించింది. కాగా ఇక్కడ డీఎంహెచ్‌వోగా పని చేసిన డాక్టర్ సి.జమాల్ బాషా ఈ ఏడాది మార్చిలో కడప బదిలీ కాగా, అప్పటి నుంచి జిల్లా అంధత్వ నివారణ సంస్థ డీపీఎం డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు డీఎంహెచ్‌వోగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఏడీఎంహెచ్‌వోగా ఎన్.ప్రసాద్ నాయక్ నియామకం
స్థానిక ఐటీడీఏ పరిధిలోని అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా ఉన్న ఎన్.ప్రసాద్ నాయక్‌ను ప్రభుత్వం నియమించింది. స్థానిక ఏడీఎంహెచ్‌వో పోస్టు గత ఐదేళ్లుగా ఖాళీగానే ఉండడంతో పీహెచ్‌సీల్లో పని చేసే సీనియర్ డాక్టర్‌కు ఏడీఎంహెచ్‌వోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రసాద్ నాయక్ నియామకంతో ఈ పోస్టు భర్తీ అయింది.