Share News

దళారులను నమ్మి మోసపోవద్దు

ABN , Publish Date - Dec 27 , 2025 | 10:55 PM

కాఫీ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

దళారులను నమ్మి మోసపోవద్దు
మోదాపల్లిలో కాఫీ రైతుల అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌ కుమార్‌

కాఫీ రైతులకు జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌ కుమార్‌ పిలుపు

రైతులు ఆర్థిక పరిపుష్టికి కృషి

అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపునకు కృషి చేసిన జీసీసీ

పాడేరురూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాఫీ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని మోదాపల్లి గ్రామంలో నిర్వహించిన కాఫీ రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాఫీ రైతులకు జీసీసీ గిట్టుబాటు ధరను కల్పిస్తుందన్నారు. జీసీసీ కిలో పార్చిమెంట్‌ రూ.450, చెర్రీ రూ.270, రోబాస్ర్టా చెర్రీ రూ.170లకు కొనుగోలు చేస్తుందన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు తీసుకువచ్చేందుకు జీసీసీ ఎంతో కృషి చేసిందన్నారు. కాఫీ రైతులు ఆర్థికంగా బలపడేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ఆర్గనైజేషన్‌ సెక్రటరీ సాగర సుబ్బారావు, టీడీపీ నాయకులు త్రినాథ్‌, మురళి, మల్లేష్‌, జీసీసీ మేనేజర్లు, జీసీసీ సిబ్బంది, కాఫీ రైతులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 10:55 PM