Share News

తీరనున్న డోలీ కష్టాలు

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:14 PM

సొవ్వా పంచాయతీ మారుమూల సాగరివలస గ్రామానికి దశాబ్దాల నాటి కల నెరవేరింది. ఎట్టకేలకు రహదారి నిర్మాణం జరుగుతోంది. దీని వలన 13 గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి.

తీరనున్న డోలీ కష్టాలు
సాగరివలసకు రహదారి నిర్మిస్తున్న దృశ్యం

ఎట్టకేలకు సాగరివలస గ్రామానికి రహదారి నిర్మాణం

నెరవేరనున్న దశాబ్దాల నాటి కల

డుంబ్రిగుడ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): సొవ్వా పంచాయతీ మారుమూల సాగరివలస గ్రామానికి దశాబ్దాల నాటి కల నెరవేరింది. ఎట్టకేలకు రహదారి నిర్మాణం జరుగుతోంది. దీని వలన 13 గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి.

డోలీ మోతల కష్టాలు ఉండకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో సొవ్వా పంచాయతీ కేంద్రం జంక్షన్‌ నుంచి మారుమూల సాగరివలస గ్రామం వరకు 15 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రెండు వారాల క్రితం రహదారి నిర్మాణ పనులు ప్రారంభమై జోరుగా సాగుతున్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే 13 గ్రామాల ప్రజలకు మేలు జరగనుంది. ఇప్పటి వరకు ఆయా గ్రామస్థులు అత్యవసర వైద్య సేవలకు డోలీలనే ఆశ్రయిస్తున్నారు. పంచాయతీ కేంద్రానికి కాలినడ కనే వెళుతున్నారు. ప్రస్తుతం ఈ రహదారి పనులు జరుగుతుం డడంతో తమ కష్టాలు తీరనున్నాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:14 PM