రోగికి తప్పని డోలీ మోత
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:29 PM
మండలంలోని లంగుపర్తి పంచాయతీ నేలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు.
ఐదు కిలోమీటర్లు గెడ్డలను దాటుకుంటూ తరలింపు
అనంతగిరి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లంగుపర్తి పంచాయతీ నేలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. బుధవారం గ్రామానికి చెందిన శిరగం ఎండన్న(62) అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు దట్టమైన అటవీ ప్రాంతం గుండా గెడ్డలను దాటుకుంటూ సుమారు ఐదు కిలోమీటర్లు డోలీలో లంగుపర్తి పీహెచ్‌సీకి తరలించారు. ఎర్రమెట్టు, దొనిగుమ్మి, నేలపాలెం, వంతెనగరువు, బురదగుమ్మి గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.