Share News

గర్భిణికి తప్పని డోలీ మోత

ABN , Publish Date - Mar 14 , 2025 | 10:25 PM

మండలంలోని పినకోట పంచాయతీ రాచకీలం గ్రామానికి చెందిన సుకూరు దేముడమ్మకు నెలల నిండడంతో గురువారం పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో గ్రామానికి అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులు రాచకీలం నుంచి డోలీమోతపై గర్భిణి గుమ్మంతికి తరలించారు.

గర్భిణికి తప్పని డోలీ మోత
గర్భిణిని డోలీమోతలపై తరలిస్తున్న కుటుంబ సభ్యులు

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

గుమ్మంతి-రెడ్డిపాడు రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన

అటవీ శాఖ అనుమతులు లేకప్రారంభం కాని రోడ్డు పనులు

గిరిజనులకు తప్పని తిప్పలు

అనంతగిరి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పినకోట పంచాయతీ రాచకీలం గ్రామానికి చెందిన సుకూరు దేముడమ్మకు నెలల నిండడంతో గురువారం పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో గ్రామానికి అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులు రాచకీలం నుంచి డోలీమోతపై గర్భిణి గుమ్మంతికి తరలించారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లోని అనకాపల్లి జిల్లా కె.కోటపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. గుమ్మంతి నుంచి రాచకీలం మీదుగా రెడ్డిపాడు వరకు రూ.5.49 కోట్లతో రోడ్డు పనులకు డిసెంబరు 21వ తేదీన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ శంకుస్థాపన చేశారు. అయితే నేటికీ అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. దీంతో గిరిజనులకు డోలీమోతలు తప్పడం లేదు.

Updated Date - Mar 14 , 2025 | 10:25 PM