Share News

మాకవరపాలెంలో ‘డోజ్కో’ కంపెనీ

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:29 AM

జిల్లాలోని మాకవరపాలెం మండలంలో ప్రైవేటు రంగంలో ‘ఎర్త్‌ మూవర్స్‌’ యంత్రాలు, వాటి విడిభాగాలు తయరుచేసే పరిశ్రమ ఏర్పాటు కానున్నది. ఈ మేరకు ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘డోజ్కో ప్రైవేటు లిమిటెడ్‌’ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది.

మాకవరపాలెంలో ‘డోజ్కో’ కంపెనీ
స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుని కలిసిన డోజ్కో కంపెనీ జీఎం చంద్రశేఖర్‌, ఏజీఎం రామారావు

ఎర్త్‌ మూవర్స్‌ యంత్రాలు, విడిభాగాల తయారీ

రూ.1,234 కోట్ల పెట్టుబడులు

స్పీకర్‌ అయ్యన్నను కలిసిన కంపెనీ ఉన్నతాధికారులు

నర్సీపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మాకవరపాలెం మండలంలో ప్రైవేటు రంగంలో ‘ఎర్త్‌ మూవర్స్‌’ యంత్రాలు, వాటి విడిభాగాలు తయరుచేసే పరిశ్రమ ఏర్పాటు కానున్నది. ఈ మేరకు ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘డోజ్కో ప్రైవేటు లిమిటెడ్‌’ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.1,234 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ కంపెనీ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు తెలిసింది. డోజ్కో కంపెనీ జనరల్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌) చంద్రశేఖర్‌, ఏజీఎం రామారావు గురువారం నర్సీపట్నం వచ్చి స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం ఇండస్ట్రియల్‌ హబ్‌గా మారుబోతున్నందుకు ఆనందంగా వుందన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:29 AM