Share News

రైళ్లకు దీపావళి తాకిడి

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:02 AM

వరుస సెలవులు రావడంతో దీపావళి సమయంలో రైళ్లకు డిమాండ్‌ పెరిగింది.

రైళ్లకు దీపావళి తాకిడి

  • సికింద్రాబాద్‌ రైళ్లకు సాధారణం

  • బెంగళూరు, చెన్నై, హౌరా రైళ్లకు ఫుల్‌ డిమాండ్‌

  • నెలాఖరు వరకూ బెర్తులు రిజర్వు

  • ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు నవంబరు 10 వరకూ...

  • సికింద్రాబాద్‌ రైళ్లకు సాధారణ రద్దీ

విశాఖపట్నం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి):

వరుస సెలవులు రావడంతో దీపావళి సమయంలో రైళ్లకు డిమాండ్‌ పెరిగింది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్‌ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రైళ్లలో ఈ నెలాఖరు వరకూ బెర్తులు రిజర్వు అయిపోయాయి.

బెంగళూరు రైళ్లు ఫుల్‌

విశాఖ మీదుగా బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18463)కు నవంబరు 10 వరకు బెర్తులు నిండిపోయాయి. అలాగే విశాఖ మీదుగా ప్రతిరోజు నడిచే హౌరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (12863)కు నెలాఖరు వరకూ బెర్తు లభించని పరిస్థితి ఏర్పడింది. ఇంకా భువనేశ్వర్‌-బెంగళూరు (22833), హౌరా-బెంగళూరు హంసఫర్‌ (22887), హౌరా-బెంగళూరు దురంతో (12245), హటియా-బెంగళూరు (12835), గువాహటి-బెంగళూరు (12510), భగల్‌పూర్‌-బెంగళూరు అంగా ఎక్స్‌ప్రెస్‌ (12254), అగర్తల-బెంగళూరు హంసఫర్‌ (12504), కామాఖ్య-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (12552), పూరి-యశ్వంత్‌పూర్‌ గరీబ్‌రఽథ్‌ (22833), టాటా-యశ్వంత్‌పూర్‌ (18111), జసిదిన్‌ జంక్షన్‌-బెంగళూరు (22306), హౌరా-మైసూర్‌ (22817), భువనేశ్వర్‌-బెంగళూరు (12845), న్యూ టిన్సుకియా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (22502), హౌరా-బెంగళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (22863), ముజాఫర్‌పూర్‌-బెంగళూరు (15228) ఎక్స్‌ప్రెస్‌ వంటి బై వీక్లీ, వారాంతపు రైళ్లకు నెలాఖరు వరకు డిమాండ్‌ నెలకొంది. రెండు, మూడు వారాంతపు రైళ్లలో కొన్ని బెర్తులు అందుబాటులో ఉన్నాయి.

చెన్నై రైళ్లకు డిమాండ్‌

కోరమండల్‌ (12841), మెయిల్‌ (12839), బొకారో (13351) వంటి రెగ్యులర్‌ రైళ్లతోపాటు విశాఖ-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ (22801), హౌరా-కన్యాకుమారి (12665), భువనేశ్వర్‌-పాండిచ్చేరి (12898), భువనేశ్వర్‌-చెన్నై సూపర్‌ఫాస్ట్‌ (12830), టాటా-ఎర్నాకులం (18189), ముజాఫర్‌పూర్‌-బెంగళూరు (15228), షాలిమార్‌-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ (22825), అగర్తలా-బెంగళూరు హంసఫర్‌ (12504) రైళ్లలో నెలాఖరు వరకు బెర్తులు లభించే పరిస్థితి లేదు.

హౌరా రైళ్లకు డిమాండ్‌

విశాఖ మీదుగా ప్రతిరోజు నడిచే సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (12704), చెన్నై-హౌరా కోరమండల్‌ (12842), చెన్నై-హౌరా మెయిల్‌ (12840), హైదరాబాద్‌-షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ (18046), బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌ (12864) రైళ్లకు నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయాయి. అంతేకాకుండా బై వీక్లీ, వారాంతపు రైళ్లు వాస్కోడిగామ-షాలిమార్‌ (18048), తిరుచరాపల్లి-హౌరా (12664), చెన్నై-సంత్రాగచ్చి (22808), పాండిచ్చేరి-హౌరా (12868), చెన్నై-షాలిమార్‌ (22826), బెంగళూరు-గువాహటి (12509), బెంగళూరు-హౌరా హంసఫర్‌ (22888), త్రివేండ్రం-షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌ (22641), సికింద్రాబాద్‌-షాలిమార్‌ (22850), కన్యాకుమారి-హౌరా (12666), తిరుపతి-హౌరా హంసఫర్‌ (20890), మంగళూరు-సంత్రాగచ్చి వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (22852), నాగర్‌కోయిల్‌-షాలిమార్‌ గురుదేవ్‌ ఎక్స్‌ప్రెస్‌ (12659), తిరుపతి-సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్‌ (22856) రైళ్లకు డిమాండ్‌ ఏర్పడింది. కొన్ని వారాంతపు రైళ్లకు కొన్ని తేదీల్లో మాత్రం బెర్తులు అందుబాటులో ఉన్నాయి

సికింద్రాబాద్‌ వెళ్లే రైళ్లకు సాధారణ రద్దీ

విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727), విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17015), గరీబ్‌రఽథ్‌ (12739), విశాఖ-నాందేడు (20811), ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (18519), దురంతో (22203), విశాఖ-మహబూబ్‌నగర్‌ (12861), జన్మభూమి (12805), వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సాధారణ రద్దీ నెలకొంది. కోణార్క్‌, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మాత్రం నెలాఖరు వరకు ఖరారు బెర్తు లభించే పరిస్థితి లేదు. గరీభ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 27 నుంచి బెర్తులు ఖాళీ ఉండగా...గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 15 నుంచి కొన్ని తేదీల్లో ఏసీ బెర్తులు అందుబాటులో ఉన్నాయి. విశాఖ, సికింద్రాబాద్‌ మధ్య నడుస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు (20833, 20708) ఈ నెల 14 నుంచి ఖాళీలు ఉన్నాయి.


ఆర్టీసీకి పండుగ

దసరా స్పెషల్‌ ్స ద్వారా రూ.1.05 కోట్ల ఆదాయం

ప్రత్యేక సర్వీసులు 650...110 శాతం ఆక్యుపెన్సీ

ద్వారకా బస్‌స్టేషన్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి):

ఆర్టీసీ విశాఖ రీజియన్‌ దసరా సమయంలో 650 ప్రత్యేక సర్వీసులు నడిపి రూ.105 కోట్ల అదనపు ఆదాయం గడించింది. సెప్టెంబరు 27 నుంచి ఈనెల 8వ తేదీ వరకూ ఈ ప్రత్యేక సర్వీసులు నడిపింది. హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, భీమవరం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు సూపర్‌ లగ్జరీ, సూపర్‌ డీలక్స్‌, ఆలా్ట్ర డీలక్స్‌, గరుడ, గరుడ ప్లస్‌ వంటి సర్వీసులు ఆపరేట్‌ చేసింది. జోనల్‌ పరిధిలోని శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం, సోంపేట, రాజాం ప్రాంతాలకు 430, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, తదితర ప్రాంతాలకు 220 ప్రత్యేక సర్వీసులు నడిపారు.

సగటు ఓఆర్‌ 110 శాతం

దసరా ప్రత్యేక సర్వీసుల ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) 110 శాతంగా నమోదైంది. ఇంతకు ముందెన్నడూ ఈ స్థాయిలో ఓఆర్‌ నమోదు కాలేదని అధికారులు అంటున్నారు. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించిన సూపర్‌ లగ్జరీ, సూపర్‌ డీలక్స్‌, ఆలా్ట్ర డీలక్స్‌, గరుడ, గరుడ ప్లస్‌ వంటి ప్రత్యేక సర్వీసుల సగటు ఓర్‌ 95 నుంచి 100 శాతం వరకు నమోదయ్యింది. జోనల్‌ పరిధిలో రాకపోకలు సాగించే ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ సర్వీసులు కనిష్ఠంగా 120 శాతం, గరిష్ఠంగా 130 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడిచాయి. స్త్రీశక్తి పథకం అమలు వల్ల అత్యధిక సంఖ్యలో మహిళలు ఈ బస్సుల్లోనే ప్రయాణించారని అధికారులు అంటున్నారు.

ఆదాయం రూ.1.05 కోట్లు

దసరాకు ప్రత్యేక సర్వీసులు ఆపరేట్‌ చేయడం ద్వారా విశాఖ రీజియన్‌కు రూ.1.05 కోట్ల ఆదాయం వచ్చినట్టు లెక్కలు కట్టారు. ఇందులో నగదుగా వచ్చింది రూ.30 లక్షలు, స్త్రీశక్తి పథకం ద్వారా ప్రభుత్వం భరించేది రూ.75 లక్షలు. స్త్రీశక్తి పథకం కింద ప్రయాణించిన మహిళల బస్సు చార్జీల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి జమ చేయాల్సి ఉంటుంది.

Updated Date - Oct 12 , 2025 | 01:04 AM