Share News

22న జిల్లాస్థాయి మహానాడు

ABN , Publish Date - May 20 , 2025 | 01:42 AM

ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌ వద్ద ప్రకృతి లేఅవుట్‌ ప్రాంగణంలో ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న జిల్లాస్థాయి మహానాడుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నట్టు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు చెప్పారు.

22న జిల్లాస్థాయి మహానాడు

అడ్డరోడ్డులోని ఒక ప్రైవేటు లేఅవుట్‌లో ఏర్పాట్లు

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు

అనకాపల్లి, మే 19 (ఆంధ్రజ్యోతి):

ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌ వద్ద ప్రకృతి లేఅవుట్‌ ప్రాంగణంలో ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న జిల్లాస్థాయి మహానాడుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నట్టు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు చెప్పారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాస్థాయి మినీ మహానాడులో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్టు తెలిపారు. కడప జిల్లాలో ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే మహానాడుకు జిల్లా నుంచి పార్టీ శ్రేణుల తరలింపు, ఇతర ఏర్పాట్ల గురించి చర్చిస్తామన్నారు. వార్డుస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని రకాల కమిటీలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ప్రజాప్రతినిధులతోపాటు సానుభూతిపరులు జిల్లా మహానాడుకు హాజరు కావాలని కోరారు.

Updated Date - May 20 , 2025 | 01:42 AM