నేడు చోడవరంలో జిల్లా విద్య, వైజ్ఞానిక ప్రదర్శన
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:21 AM
జిల్లా విద్య, వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం చోడవరంలోని కొత్తూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి జి.అప్పారావు నాయుడు తెలిపారు.
డీఈవో అప్పారావునాయుడు
చోడవరం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్య, వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం చోడవరంలోని కొత్తూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి జి.అప్పారావు నాయుడు తెలిపారు. గురువారం ఇక్కడ జడ్పీ హైస్కూల్‌లో ఎంఈవోలు, ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మండలానికి తొమ్మిది ప్రాజెక్టుల చొప్పున మొత్తం 216 ప్రాజెక్టులను ఈ ప్రదర్శనలో ఉంచుతారన్నారు. ఈ ప్రదర్శనకు హాజరయ్యే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ డీఈవో అప్పారావు, ఎంఈవోలు పాండురంగారావు, సింహాచలం, హెచ్‌ఎం ఐవీ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.