Share News

బుడపనసలో వ్యాధుల విజృంభణ

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:21 PM

మండలంలోని మారుమూల రంగబయలు పంచాయతీ బుడపనస గ్రామంలో కొద్ది రోజులుగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నా వ్యాధులు ఆశించిన స్థాయిలో అదుపులోకి రావడం లేదు.

బుడపనసలో వ్యాధుల విజృంభణ
జ్వరంతో బాధపడుతున్న బాలుడు

ముంచంగిపుట్టు, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల రంగబయలు పంచాయతీ బుడపనస గ్రామంలో కొద్ది రోజులుగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నా వ్యాధులు ఆశించిన స్థాయిలో అదుపులోకి రావడం లేదు. దీంతో ఆ గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఆ గ్రామంలో చిన్నారులు ఎక్కువ శాతం మంది జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. గురువారం ఆ గ్రామస్థులు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామంలో జ్యోతి, దామిని, విశాల్‌, భాస్కర్‌, చందు, తులమ్మ, లక్ష్మి, మోహన్‌, బసంతి, పార్వతి, పూర్ణిమ, దివ్య, ఇలియానా, ఆనంద్‌, అవంతికతో పాటు పలువురు జ్వరాలతో బాధపడుతున్నారని చెప్పారు. కలెక్టర్‌, ఐటీడీఏ పీవో స్పందించి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:21 PM