Share News

డోజ్కో కంపెనీ డైరెక్టర్లు స్పీకర్‌తో భేటీ

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:30 AM

మైనింగ్‌, నిర్మాణ రంగాల్లో వినియోగించే ఎర్త్‌ మూవర్స్‌ యంత్ర పరికరాలు, విడిభాగాలు తయారు చేసే ‘డోజ్కో ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌’ కంపెనీ డైరెక్టర్లు శనివారం నర్సీపట్నం వచ్చి శాసన సభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వంగా కలిశారు. మాకవరపాలెం మండలంలో రూ.1,234 కోట్లు పెట్టుబడితో ఎర్త్‌మూవర్స్‌ యంత్ర పరికరాలు, విడిభాగాలు తయారీ చేసే పరిశ్రమను ఏర్పాటు చేయడానికి డోజ్కో ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీకి ప్రభుత్వం ఇటీవల 150 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే.

డోజ్కో కంపెనీ డైరెక్టర్లు స్పీకర్‌తో భేటీ
స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుని కలిసిన డోజ్కో కంపెనీ డైరెక్టర్లు

అయ్యన్నపాత్రుడుని మర్యాదపూర్వకంగా కలిసిన యాజమాన్య ప్రతినిధులు

నర్సీపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మైనింగ్‌, నిర్మాణ రంగాల్లో వినియోగించే ఎర్త్‌ మూవర్స్‌ యంత్ర పరికరాలు, విడిభాగాలు తయారు చేసే ‘డోజ్కో ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌’ కంపెనీ డైరెక్టర్లు శనివారం నర్సీపట్నం వచ్చి శాసన సభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వంగా కలిశారు. మాకవరపాలెం మండలంలో రూ.1,234 కోట్లు పెట్టుబడితో ఎర్త్‌మూవర్స్‌ యంత్ర పరికరాలు, విడిభాగాలు తయారీ చేసే పరిశ్రమను ఏర్పాటు చేయడానికి డోజ్కో ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీకి ప్రభుత్వం ఇటీవల 150 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్లు ఆర్‌కే బంగూరు, ఎన్‌జీ బంగూరు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుని కలిసి పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. పరిశ్రమ ఏర్పాటుకు సహకరించిన సీఎం చంద్రబాబు, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ, మాకవరపాలెం మండలంలో భారీ పరిశ్రమ ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. స్పీకర్‌ను కలిసిన వారిలో డోజ్కో జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌, ఆర్డీవో వీవీరమణ, తహశీల్దార్‌ రామారావు వున్నారు.

Updated Date - Dec 07 , 2025 | 12:30 AM