Share News

మన్యంలో భిన్న వాతావరణం

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:20 PM

మన్యంలో గురువారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఆ తరువాత నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా కాసింది. రాత్రి 7 గంటల నుంచి భారీ వర్షం కురిసింది.

మన్యంలో భిన్న వాతావరణం
పాడేరులో గురువారం రాత్రి భారీ వర్షం

ఉదయం మంచు.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండ

రాత్రి భారీ వర్షం

పాడేరు, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): మన్యంలో గురువారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఆ తరువాత నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా కాసింది. రాత్రి 7 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. ఏజెన్సీలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి 7 గంటల నుంచే వాతావరణం మారిపోయి తొలుత ఈదురుగాలులతో మొదలై భారీ వర్షం కొనసాగింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జనజీవనానికి కాస్త అంతరాయం ఏర్పడింది.

పాడేరులో 37.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

జిల్లా కేంద్రం పాడేరులో 37.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కొయ్యూరులో 35.6, పెదబయలులో 34.0, ముంచంగిపుట్టులో 33.8, డుంబ్రిగుడ 32.3, అనంతగిరిలో 31.8, చింత పల్లిలో 31.7, హుకుంపేటలో 31.4, అరకులోయలో 31.1, జి.మాడుగులలో 29.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముంచంగిపుట్టులో...

ముంచంగిపుట్టు: మండల పరిధిలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఠారెత్తించింది. రాత్రి 7 గంటల నుంచి భారీ వర్షం పడింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో సుమారు గంట పాటు వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా రాత్రి అయితే చాలు వర్షం పడుతోంది. ఉదయం నుంచి ఎండ వేడికి అల్లాడుతున్న జనం రాత్రి కురిసే వర్షానికి ఉపశమనం పొందుతున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:20 PM