నిబంధనలు పాటించని డయాగ్నోస్టిక్ సెంటర్ సీజ్
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:32 AM
మండలంలోని అడ్డరోడ్డులో నిబంధనలకు విరుద్ధ్దంగా నిర్వహిస్తున్న జ్యోతి డయాగ్నోస్టిక్ సెంటర్ అనే ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌ను గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు సీజ్ చేశారు. ముందుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి హైమావతి, జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి వీరజ్యోతి సిబ్బందితో పాటు ఈ ల్యాబ్‌ను సందర్శించి నిర్వాహకురాలు ఉమకు ల్యాబ్‌ను సీజ్ చేస్తున్నట్టు నోటీసు అందజేశారు.
ఎస్.రాయవరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అడ్డరోడ్డులో నిబంధనలకు విరుద్ధ్దంగా నిర్వహిస్తున్న జ్యోతి డయాగ్నోస్టిక్ సెంటర్ అనే ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌ను గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు సీజ్ చేశారు. ముందుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి హైమావతి, జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి వీరజ్యోతి సిబ్బందితో పాటు ఈ ల్యాబ్‌ను సందర్శించి నిర్వాహకురాలు ఉమకు ల్యాబ్‌ను సీజ్ చేస్తున్నట్టు నోటీసు అందజేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ రమేశ్‌బాబు సమక్షంలో జ్యోతి డయాగ్నోస్టిక్ సెంటర్‌కు సీజ్ చేశారు. దీనికి సంబంధించి డీఎంహెచ్‌వో హైమావతి మాట్లాడుతూ గత నెలలో ఈ ల్యాబ్‌లో తనిఖీలు నిర్వహించామని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్‌రే, ఈసీజీ వంటివి చేయడంలో లోపాలను గుర్తించామని చెప్పారు. దీనిపై నిర్వాహకురాలికి రెండు సార్లు నోటీసులు ఇచ్చినా సమాధానం లేకపోవడంతో సీజ్ చేశామన్నారు. కాగా నిర్వాహకురాలు ఉమా అధికారుల ఎదుట ఆందోళన చేశారు. తాను బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటుకు తన భూములు ఇవ్వకుండా పోరాడుతున్నందునే కక్ష సాధింపుగా తన ల్యాబ్‌ను సీజ్ చేశారని ఆరోపించారు.