Share News

శాకంబరిగా ధారాలమ్మ

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:35 PM

జీకేవీధి మండలం ధారకొండ ఘాట్‌ రోడ్డులో గిరిజనుల ఆరాధ్య దైవం ధారాలమ్మ శుక్రవారం శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చింది.

శాకంబరిగా ధారాలమ్మ
ధారాలమ్మ అమ్మవారిని కూరగాయలతో శాకాంబరి దేవి గా అలంకరించిన దృశ్యం

సీలేరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారకొండ ఘాట్‌ రోడ్డులో గిరిజనుల ఆరాధ్య దైవం ధారాలమ్మ శుక్రవారం శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చింది. ధారకొండ గ్రామానికి చెందిన వ్యాపారవేత్త అనుమాలశెట్టి శ్రీనివాసరావు దంపతుల సహకారంతో ఆషాఢ మాసంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి సన్నిధిలో అన్నసమారాధన ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - Jul 11 , 2025 | 11:35 PM