డీజీపీ సుడిగాలి పర్యటన
ABN , Publish Date - Jun 05 , 2025 | 01:14 AM
రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్‌కుమార్‌గుప్తా బుధవారం నగరంలో సుడిగాలి పర్యటన జరిపారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 21న కోస్టల్ బ్యాటరీ జంక్షన్ నుంచి భీమిలి వరకూ బీచ్‌రోడ్డు పొడవునా, బీచ్‌రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రోడ్లపై సుమారు ఐదు లక్షల మంది యోగా చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఏర్పాట్లు పరిశీలన
ప్రధాని పర్యటన భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం
విశాఖపట్నం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్‌కుమార్‌గుప్తా బుధవారం నగరంలో సుడిగాలి పర్యటన జరిపారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 21న కోస్టల్ బ్యాటరీ జంక్షన్ నుంచి భీమిలి వరకూ బీచ్‌రోడ్డు పొడవునా, బీచ్‌రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రోడ్లపై సుమారు ఐదు లక్షల మంది యోగా చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీచ్‌రోడ్డుతోపాటు అనుసంధాన రోడ్లను, ఏయూ మైదానంతోపాటు హెలీపాడ్‌ను డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా, ఆక్టోపస్ ఐజీ సీహెచ్ శ్రీకాంత్, సీపీ శంఖబ్రతబాగ్చితోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. తర్వాత సీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విశాఖ రేంజ్ పరిధిలోని ఐపీఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్‌తో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భద్రత ఏర్పాటుచేయాలని, బీచ్‌రోడ్డులో ఎక్కడికక్కడ నిఘా పెట్టాలని సూచించారు. దీనికి సంబంఽధించి ఎవరు ఏ విధులను నిర్వర్తించాలనే దానిపై కూడా చర్చించినట్టు తెలిసింది.