డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి బదిలీ
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:12 PM
స్థానిక జిల్లా అటవీశాఖాధికారి(డీఎఫ్‌వో) పీవీ సందీప్‌రెడ్డిని ఏలూరు డీఎఫ్‌వోగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏలూరుకు స్థానచలనం
పాడేరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా అటవీశాఖాధికారి(డీఎఫ్‌వో) పీవీ సందీప్‌రెడ్డిని ఏలూరు డీఎఫ్‌వోగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి పీవీ సందీప్‌రెడ్డి 2024 సెప్టెంబరు నుంచి స్థానిక జిల్లా అటవీ శాఖాధికారిగా పని చేస్తున్నారు. జిల్లాలో అటవీ అభివృద్ధితో పాటు, అడవులు అగ్ని ప్రమాదాలకు గురికాకుండా ఆయన ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో అడవుల్లో మంటలు చెలరేగితే, తక్షణమే అరికట్టేందుకు సత్వర చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కృషి చేశారు. సందీప్‌రెడ్డిని ఏలూరు డీఎఫ్‌వో బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఇంకా ఎవర్నీ నియమించలేదు.