Share News

మోదకొండమ్మకు భక్త నీరాజనం

ABN , Publish Date - May 13 , 2025 | 11:06 PM

పాడేరు మోదకొండమ్మ మూడు రోజుల ఉత్సవాలు మంగళవారం నిర్వహించిన అనుపోత్సవంతో ముగిశాయి. తొలి రోజు ఉత్సవం విగ్రహం, పాదాలును ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి సతకంపట్టు వద్ద కొలువు తీర్చడంతో మొదలైన ఉత్సవాలు.. ఆఖరి రోజు సతకంపట్టు నుంచి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలును తిరిగి ఆలయంలో చేర్చడంతో ముగిశాయి.

మోదకొండమ్మకు భక్త నీరాజనం
అమ్మవారి పాదాలును ఇన్‌చార్జి కలెక్టర్‌ అభిషేక్‌గౌడ, ఉత్సవ విగ్రహాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, అమ్మవారి గరగను మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఎత్తుకున్న దృశ్యం

వైభవంగా ముగిసిన మూడు రోజుల ఉత్సవాలు

ఘటాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు

అనుపోత్సవానికి పోటెత్తిన జనం

ఇన్‌చార్జి కలెక్టర్‌, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హాజరు

ఊరేగింపులో ఆకట్టుకున్న నేల వేషాలు, వివిధ ప్రదర్శనలు

పాడేరు, మే 13 (ఆంధ్రజ్యోతి): పాడేరు మోదకొండమ్మ మూడు రోజుల ఉత్సవాలు మంగళవారం నిర్వహించిన అనుపోత్సవంతో ముగిశాయి. తొలి రోజు ఉత్సవం విగ్రహం, పాదాలును ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి సతకంపట్టు వద్ద కొలువు తీర్చడంతో మొదలైన ఉత్సవాలు.. ఆఖరి రోజు సతకంపట్టు నుంచి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలును తిరిగి ఆలయంలో చేర్చడంతో ముగిశాయి. ఇన్‌చార్జి కలెక్టర్‌, జేసీ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశఽ్వరి, తదితరులు పాదాలు, ఉత్సవ విగ్రహం, అమ్మవారి ఘటాలను తలకెత్తుకుని అనుపోత్సవాన్ని ప్రారంభించారు. సతకంపట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు నిర్వహించిన ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనుపోత్సవం ఊరేగింపులో పలు రకాల నేల వేషాలు, డప్పుల మోతలు, కేరళ ఓనం బ్యాండ్‌, తీన్‌మార్‌ బ్యాండ్‌ వంటివి ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ఆఖరి రోజు కావడంతో అధిక సంఖ్యలో జనం ఊరేగింపులో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం నుంచి అమ్మవారికి అధిక సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. డప్పుల మోతలతో వచ్చి అమ్మవారికి ఘటాలు సమర్పించడం ఆనవాయితీ. దీంతో భక్తులు కుటుంబాలతో ఘటాలు తీసుకువచ్చి మోదకొండమ్మకు సమర్పించారు. మొక్కుబడిలో భాగంగా పలువురు భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ వి.అభిషేక్‌, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.కోటినాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు సల్లా రామకృష్ణ, టి.ప్రసాదరావునాయుడు, కె.సురేశ్‌కుమార్‌, కెజియారాణి, కె.ప్రశాంత్‌, కె.సతీశ్‌, కె.వెంకటరమణ, ఉత్సవ, ఆలయ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 11:06 PM