వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:50 AM
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొండపై వున్న ఆలయంలో స్వామి నిజరూపానికి తెల్లవారుజామున మూడు గంటలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభించారు.
గోవింద నామస్మరణతో మార్మోగిన ఉపమాక
నక్కపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొండపై వున్న ఆలయంలో స్వామి నిజరూపానికి తెల్లవారుజామున మూడు గంటలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. స్వామివారిని ఉత్తరద్వారంలో దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండ దిగువ ఆలయంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీరంగనాథుడిగా శేషశయ్యపై శయనించిన స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మంగళవారం రాత్రి ఎనిమిది వాహనాలతో గోవిందనామ స్మరణల మధ్య తిరువీధి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని శ్రీరంగనాథుడిగా అలంకరించి ఉభయదేవేరులతో పుణ్యకోటి వాహనంలో మాఢవీధుల్లో ఊరేగించారు.