దట్టంగా పొగమంచు
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:01 AM
మైదాన ప్రాంతంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకున్నది.
కృష్ణాదేవిపేట, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మైదాన ప్రాంతంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకున్నది. దీనికితోడు చలితీవ్రత పెరిగింది. మంచు కారణంగా వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. పొలం పనులను ఒకింత ఆలస్యంగా మొదలుపెట్టాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు.