దట్టంగా పొగమంచు
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:31 PM
మన్యంలో శనివారం పొగమంచు దట్టంగా కమ్మేసింది.
జి.మాడుగులలో 14.2 డిగ్రీలు
పాడేరు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): మన్యంలో శనివారం పొగమంచు దట్టంగా కమ్మేసింది. శీతాకాలం కావడంతో ఏజెన్సీలో ఈ సమయంలో పొగమంచు కురవడం సహజం. అయితే శనివారం దట్టంగా పొగమంచు కురవడంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కన్పించని విధంగా వాతావరణం ఏర్పడింది. దీంతో వాహనదారులు తమ వాహనాల లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. రానున్న రోజుల్లో మరింత దట్టంగా మంచు కురుస్తుందని స్థానికులు అంటున్నారు. అలాగే వాతావరణంలోని మార్పులతో ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు సైతం తగ్గుతున్నాయి. జి.మాడుగులలో శనివారం 14.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా.. పాడేరులో 15.7, అరకులోయలో 16.0, డుంబ్రిగుడ, హుకుంపేట, చింతపల్లిలో 16.2, ముంచంగిపుట్టు, పెదబయలులో 16.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.