బస్తరు పిక్కలకు గిరాకీ
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:26 PM
హుకుంపేటలో ప్రతి శనివారం జరిగే సంతలో బస్తరు పిక్కలకు మంచి ధర పలికింది. వీటి కొనుగోలుకు వ్యాపారులు ఎగబడ్డారు.
హుకుంపేట సంతలో కిలో రూ.300లకు కొనుగోలు
గిరి రైతులు ఆనందం
హుకుంపేట, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): హుకుంపేటలో ప్రతి శనివారం జరిగే సంతలో బస్తరు పిక్కలకు మంచి ధర పలికింది. వీటి కొనుగోలుకు వ్యాపారులు ఎగబడ్డారు. కిలో బస్తరు పిక్కలు రూ.300లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో గిరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి వారం సంతలో బస్తరు పిక్కలకు మంచి ధర పలికిందని వారంటున్నారు. సాధారణంగా వీటి ధర కిలో 120 రూపాయలు ఉంటుందని, పంట వచ్చిన మూడు వారాల వరకు ధర అధికంగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. వచ్చే వారం కూడా ధర బాగానే ఉంటుందని అంటున్నారు.