Share News

పీహెచ్‌డీ ప్రవేశాల్లో జాప్యం

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:54 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వివిధ విభా గాల్లో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఎంతోమంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

పీహెచ్‌డీ ప్రవేశాల్లో జాప్యం

  • గత ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన నెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇప్పటికీ ప్రవేశాలు కల్పించని ఏయూ

  • ఏడాది వృథా అవుతోందని ఆందోళన

  • డిసెంబరులో జరిగిన నెట్‌ ఫలితాలు కూడా వెల్లడి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వివిధ విభా గాల్లో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఎంతోమంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. గడిచిన ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన యూజీసీ నెట్‌ (జాతీయ అర్హత పరీక్ష)లో అర్హత సాధించిన పలువురు...ప్రవేశాల ప్రక్రియ జాప్యం కావ డంపై ఆందోళన చెందుతున్నారు. యూని వర్సిటీల్లో పీహెచ్‌డీ అడ్మిషన్లు యూజీసీ నిర్వ హించే నెట్‌ స్కోర్‌ ద్వారా చేపట్టాలని గత ఏడాది ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు జనవరి రెండో తేదీన నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ కూడా విడుదల చేశారు. అయితే, నెలలు గడుస్తున్నా అధికారులు అడ్మిషన్ల ప్రక్రియను ముందుకుతీసుకువెళ్లకపోవడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు వర్సిటీలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌), పీహెచ్‌డీ ప్రవే శాలు కల్పిస్తారు. ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు జేఆర్‌ఎఫ్‌గా, మిగిలిన వారు పీహెచ్‌డీ ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే, నెలలు గడుస్తున్నా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల ఏడాది సమయం వృథా అయిపోతోందని చెబు తున్నారు. రెండేళ్లలో ప్రవేశాలు నిర్వహించక పోతే మొత్తం ఫండ్‌ వెనక్కి వెళ్లిపోతుందని పేర్కొంటున్నారు. ఇదిలావుంటే ఇప్పటివరకూ సెప్టెంబరులో నిర్వహించిన యూజీసీ నెట్‌కు సంబంధించిన అడ్మిషన్స్‌నే అధికారులు చేపట్ట లేదు. డిసెంబరులో కూడా యూజీసీ నెట్‌ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలు కూడా వెలువడ్డాయి. వాటికి సంబంధించిన అడ్మిషన్లు ఇంకెప్పుడు చేపడతారోనన్న ఆందోళనను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పీడీఎస్‌వో విద్యార్థి సంఘ నేతలు వీసీని కలిసి తెలియజేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అడ్మిషన్స్‌ ప్రక్రియను పూర్తి చేయాలని పీడీఎస్‌వో విద్యార్థి సంఘ నేత భాను కోరారు.

Updated Date - Apr 30 , 2025 | 12:54 AM