ముస్తాబైన చర్చిలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:28 AM
నగరంలో క్రిస్మస్ సందడి మొదలైంది. చర్చిలన్నీ విద్యుత్ దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అనేక చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు.
అర్ధరాత్రి దాటిన తరువాత ప్రత్యేక ప్రార్థనలు
విశాఖపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
నగరంలో క్రిస్మస్ సందడి మొదలైంది. చర్చిలన్నీ విద్యుత్ దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అనేక చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. వన్‌టౌన్‌లోని సెయింట్ జాన్స్, కోర్టు సమీపంలోని పునీత ఆంథోనీ చర్చి, గవర్నర్ బంగ్లా సమీపంలోని పాల్స్ చర్చి, తాటిచెట్లపాలెంలో గల లూర్థు మాత దేవాలయం, జగదాంబ జంక్షన్ సమీపంలోని ట్రినిటి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు క్రీస్తు జననం అర్థాన్ని, దేవుని ప్రేమను వివరించారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని ట్రినిటీ చర్చిలో నిర్వహించిన ముందస్తు వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఆయన కేక్ కట్ చేసి క్యాండిల్ వెలిగించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఏసు త్యాగం, క్రిస్మస్ ప్రత్యేకతను వివరించారు. క్రిస్మస్ సందడి నగరమంతా కనిపించింది.