నిద్రావస్థలో డీ అడిక్షన్ సెంటర్.!
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:18 AM
ఇటీవల మద్యం, గంజాయి, ఇతర మత్తు పదా ర్థాలకు బానిసలుగా మారుతున్న వారి సంఖ్య పెరుగు తోంది.
కేజీహెచ్‌లో బాధితులను ఇన్‌పేషెంట్లుగా చేర్చి వైద్య సేవలు అందించలేని పరిస్థితి
ఐదు నెలలు నుంచిగా సిబ్బంది జీతాలు పెండింగ్
ఉన్నతాఽధికారులు దృష్టిసారిస్తే మేలు
విశాఖపట్నం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):
ఇటీవల మద్యం, గంజాయి, ఇతర మత్తు పదా ర్థాలకు బానిసలుగా మారుతున్న వారి సంఖ్య పెరుగు తోంది. దురలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించి సాధారణ స్థితికి తీసుకురావాలన్న ఉద్దేశంతో కేజీహెచ్‌లో డీఅడిక్షన్ సెంటర్‌ను 2020లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆశించినస్థాయిలో వైద్యసేవలు అంద డం లేదు. తప్పనిసరిగా మానసిక వైద్య నిపుణులు ఉండాలి. ఈ సెంటర్‌లో ఎంబీబీఎస్ చేసిన వైద్యులతో సేవలందిస్తున్నారు. సెంటర్‌కు వచ్చే బాధితుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇన్‌పేషెంట్లుగా చేర్చుకోవాలి.ఈ కేంద్రం ఏర్పాటైనప్పటి నుంచి ఓపీ సేవలను మాత్రమే అందిస్తున్నారు. ఐపీ విభాగాన్ని పక్కన పెట్టేయడంతో ఇబ్బందులు తప్పడంలేదు. తీవ్రస్థాయిలో ఇబ్బంది పడే రోగులు పెదవాల్తేరులోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో చేరుతుండగా, మరికొంతమంది ప్రైవేటు ఆస్పత్రులకు ఆశ్రయిస్తున్నారు.
ఈ తరహా సమస్యలతో..
డీ అడిక్షన్ సెంటర్‌కు వచ్చే వారిలో ఎక్కువమంది మత్తుపదార్థాలకు బానిసలుగా మారిన వారే. వీరిలో దాదాపు 60 శాతం మంది 20 నుంచి 35 ఏళ్లలోపు యువత. వీరిలోనూ ఎక్కువగా మద్యానికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారే ఎక్కువని అధికారులు చెబుతున్నారు. ఇంట్లోని వారి మాట వినే పరిస్థితి లేకపోవడం, అప్పులు చేయడం, ఇంటికి సరిగా రాకపోవడంతో కుటుంబసభ్యులు బలవంతంగా కేంద్రానికి తీసుకువస్తున్నారు. ఇక్కడ బాధితులకు కౌన్సెలింగ్‌తో పాటు మందులు, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తో సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మానసిక వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో సేవలపై ప్రభావం పడుతోంది.
సుదూర ప్రాంతాల నుంచి..
కేంద్రానికి ప్రతిరోజూ 20 మంది రోగులు వస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోవాల్సి ఉంటుంది. అయితేఇక్కడ ఐపీ విభాగం ఏర్పాటును అధికారులు పట్టించుకోకపోవడంతో ఓపీ సేవలకు మాత్రమే అందిస్తున్నారు.
సిబ్బంది కొరత..
కేంద్రంలో మానసిక వైద్య నిపుణులు లేరు. మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు కౌన్సెలర్లు మాత్ర మే ఉన్నారు. ఇద్దరు మానసిక నిపుణులు, నర్సింగ్ సిబ్బందిని కేటాయిస్తే ఇన్‌పేషెంట్ విభాగాన్ని ప్రారం భించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేంద్రానికి తొమ్మిది పోస్టులు మంజూరు కాగా, ఆరు గురు మాత్రమే పనిచేస్తున్నారు. వీరంతా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే. వీరిలో ఒకరు సెలవులో ఉండడంతో సేవలపై ప్రభావం పడుతోంది. దీంతోపాటు గత ఐదునెలలుగా జీతాలు పెండింగ్‌లో పెట్టడంతో మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.