Share News

నేల బావిలో వివాహిత మృతదేహం

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:09 PM

మండలంలోని గర్నికం పంచాయతీ శివారు కానాడ గ్రామంలో సోమవారం ఓ వివాహిత నేల బావిలో శవమై తేలింది. ఆమె ప్రమాదవశాత్తూ నేల బావిలో పడిందా?, లేక ఆత్మహత్య చేసుకుందా? అనే వివరాలు తెలియరాలేదు.

నేల బావిలో వివాహిత మృతదేహం
శివలక్ష్మి మృతదేహం వద్ద విలపిస్తున్న భర్త, కుటుంబ సభ్యులు

రావికమతం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని గర్నికం పంచాయతీ శివారు కానాడ గ్రామంలో సోమవారం ఓ వివాహిత నేల బావిలో శవమై తేలింది. ఆమె ప్రమాదవశాత్తూ నేల బావిలో పడిందా?, లేక ఆత్మహత్య చేసుకుందా? అనే వివరాలు తెలియరాలేదు. దీనికి సంబంధించి రావికమతం ఎస్‌ఐ రఘువర్మ, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. గర్నికం గ్రామానికి చెందిన శివలక్ష్మి(31)కి కానాడ గ్రామానికి చెందిన పసలపూడి చిరంజీవితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శివలక్ష్మికి అప్పుడప్పుడు మూర్ఛ వస్తుండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సోమవారం ఉదయం ఆమె గ్రామ శివారుకు పశువులను మేతకు తోలుకువెళ్లింది. అయితే మూర్ఛ వచ్చి ఆమె నేల బావిలో పడిపోయిందా? లేక ఇంకేదైనా కారణమా? అనేది తెలియలేదు. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాపు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Aug 11 , 2025 | 11:09 PM