Share News

డీఎంహెచ్‌వోగా డి.కృష్ణమూర్తి నాయిక్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Oct 17 , 2025 | 10:59 PM

స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా డాక్టర్‌ డి.కృష్ణమూర్తి నాయిక్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

డీఎంహెచ్‌వోగా డి.కృష్ణమూర్తి నాయిక్‌ బాధ్యతల స్వీకరణ
డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరిస్తున్న కృష్ణమూర్తినాయిక్‌

గుంటూరు జీజీహెచ్‌ డీసీఎస్‌కు

పదోన్నతిపై అల్లూరి జిల్లాలో నియామకం

ఏడీఎంహెచ్‌వోగా ప్రసాద్‌ నియామకం

పాడేరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా డాక్టర్‌ డి.కృష్ణమూర్తి నాయిక్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గా ఉన్న ఆయనకు పదోన్నతి కల్పిస్తూ అల్లూరి జిల్లా డీఎంహెచ్‌వోగా నియమించారు. ప్రస్తుతం ఇన్‌చార్జి బాధ్యతలు చేపడుతున్న జిల్లా అంధత్వ నివారణ సంస్థ డీపీఎం డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన స్థానిక మోదకొండమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని ప్రజలకు చక్కని వైద్యారోగ్య సేవలు అందిస్తామని డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయిక్‌ పేర్కొన్నారు.

ఏడీఎంహెచ్‌వోగా ఎన్‌.ప్రసాద్‌ నాయిక్‌

స్థానిక ఐటీడీఏ పరిధిలోని అదనపు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా విశాఖపట్నం ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గా ఉన్న ఎన్‌.ప్రసాద్‌ను పదోన్నతిపై నియమించారు. స్థానిక ఏడీఎంహెచ్‌వో పోస్టు గత ఐదేళ్లుగా ఖాళీగానే ఉండడంతో పీహెచ్‌సీల్లో పనిచేసే సీనియర్‌ డాక్టర్‌కు ఏడీఎంహెచ్‌వోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ కొనసాగిస్తున్నారు. కొత్తగా ఏడీఎంహెచ్‌వోగా నియమించిన ప్రసాద్‌ నాయిక్‌ త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది.

Updated Date - Oct 17 , 2025 | 10:59 PM