సందర్శకుల సందడి
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:49 AM
మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు శనివారం పర్యాటకులు భారీగా వచ్చారు.
అనంతగిరి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు శనివారం పర్యాటకులు భారీగా వచ్చారు. 3,300 మంది గుహలను తిలకించగా, రూ.3 లక్షల ఆదాయం వచ్చిందని యూనిట్ మేనేజర్ గౌరీశంకర్ తెలిపారు. మండలంలోని తాటిగుడ, కటికి, సరియా జలపాతానికి కూడా పర్యాటకులు పోటెత్తారు. జలపాతాల అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు.
చాపరాయి జలవిహారిలో..
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి జలవిహారికి పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. స్నానాలు చేసి ఉల్లాసంగా గడిపారు. అలాగే అరకు పైనరీ, కోలాపుట్టు జలతరంగిణి వద్ద కూడా పర్యాటకులు సందడి చేశారు.