Share News

పర్యాటకుల సందడి

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:40 AM

అరకులోయలోని అందాలను తిలకించేందుకు శనివారం అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. రెండవ శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు కలిసి రావడంతో సందర్శకులు ఇక్కడికి తరలి వచ్చారు. గిరిజన మ్యూజియం వద్ద సాయంత్రం సందడి నెలకొంది.

పర్యాటకుల సందడి
చాపరాయి జలవిహరీలో పర్యాటకులు

అరకులోయ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అరకులోయలోని అందాలను తిలకించేందుకు శనివారం అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. రెండవ శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు కలిసి రావడంతో సందర్శకులు ఇక్కడికి తరలి వచ్చారు. గిరిజన మ్యూజియం వద్ద సాయంత్రం సందడి నెలకొంది. పర్యాటకులు విశాఖపట్నం నుంచి రైలు మార్గంలో బొర్రా గుహలు వరకు వచ్చి బొర్రా గుహలను, కటికి, తాడిగుడ జలపాతాలను సందర్శించారు. మార్గమధ్యంలో ఘాట్‌ రోడ్డులోని బీసుపురం, అనంతగిరి, సుంకరమెట్ట కాఫీతోటలు, గాలికొండ వ్యూపాయింట్‌, సుంకరమెట్ట వద్ద కాఫీతోటల్లో ఉడెన్‌ బ్రిడ్జిని తిలకించి సాయంత్రానికి అరకు చేరుకున్నారు.

జలవిహరీలో...

డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి జలవిహరీలో, అరకు సిల్క్‌ఫాం వద్ద పర్యాటకుల సందడి కనిపించింది. జలవిహరీలో స్నానాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు.

Updated Date - Sep 14 , 2025 | 12:40 AM