రిజర్వాయర్ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:11 AM
పాపయ్యపాలెం రిజర్వాయర్‌లో భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు పెడతామని తహసీల్దార్ జి.వెంకటరమణ హె చ్చరించారు. ‘పాపయ్యపాలెం జలాశయంలో 30 ఎకరాల భూమి కబ్జా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దీంతో శనివారం తహశీల్దార్‌తో పాటు పోలీసు సిబ్బంది, రిజర్వాయర్ కమిటీ చైర్మన్, టీడీపీ నాయకులు రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు.
- తహశీల్దార్ హెచ్చరిక
- ఆక్రమిత భూముల పరిశీలన
మాకవరపాలెం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): పాపయ్యపాలెం రిజర్వాయర్‌లో భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు పెడతామని తహసీల్దార్ జి.వెంకటరమణ హె చ్చరించారు. ‘పాపయ్యపాలెం జలాశయంలో 30 ఎకరాల భూమి కబ్జా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దీంతో శనివారం తహశీల్దార్‌తో పాటు పోలీసు సిబ్బంది, రిజర్వాయర్ కమిటీ చైర్మన్, టీడీపీ నాయకులు రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. రిజర్వాయర్‌కు సంబంధించిన భూమి ఎంత ఉంది?, దీనికి హద్దులు ఎక్కడ ఉన్నాయి? అనే దానిని పరిశీలించారు. రిజర్వాయర్ భూములను ఆక్రమించిన రైతుల పేర్లు నమోదు చేయాలని రెవెన్యూ సిబ్బందిని తహశీల్దార్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపయ్యపాలెం రిజర్వాయర్ భూములు ఆక్రమణకు గురికావడం నిజమేనన్నారు. ఆక్రమణదారులు వెంటనే ఖాళీ చేయాలని, లేకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోమవారం నుంచి రిజర్వాయర్ భూములు సర్వే చేసి హద్దులు గుర్తించి ఉపాధి హామీ పథకం ద్వారా చుట్టూ గట్టు ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో ఈ రిజర్వాయర్‌లో ఎటువంటి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు రమణమ్మ, తాతబాబు, శివతో పాటు సాగు రైతులు పాల్గొన్నారు.