Share News

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:49 AM

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నేరాలను అరికట్టడంతోపాటు వివిధ కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న నేరస్థులను త్వరితగతిన పట్టుకోవాలని ఎంపీ సీఎం రమేశ్‌ పోలీసు శాఖను కోరారు. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీసుస్టేషన్‌లో అత్యాధునిక సీసీటీవీ కంట్రోల్‌రూమ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  నేరాల నియంత్రణ
సీసీటీవీ కంట్రోల్‌ రూమును ప్రారంభించిన ఎంపీ రమేశ్‌. చిత్రంలో కలెక్టర్‌, ఎస్పీ, కూటమి నాయకులు, పోలీసు అధికారులు

ఎంపీ సీఎం రమేశ్‌

అనకాపల్లి పట్టణ పోలీసుస్టేషన్‌లో సీసీటీవీ కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభం

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నేరాలను అరికట్టడంతోపాటు వివిధ కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న నేరస్థులను త్వరితగతిన పట్టుకోవాలని ఎంపీ సీఎం రమేశ్‌ పోలీసు శాఖను కోరారు. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీసుస్టేషన్‌లో అత్యాధునిక సీసీటీవీ కంట్రోల్‌రూమ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. నేరాల నియంత్రణ, మహిళల భద్రత లక్ష్యంగా ఎంపీ నిధులతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో 80 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్ఠ పరిచారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అనకాపల్లిలో ప్రజల భద్రతకు ప్రఽథమ ప్రాధాన్యం ఇస్తున్నామని, పోలీసు యంత్రాంగానికి ప్రజా ప్రతినిధుల పరంగా పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఎస్పీ తుహిన్‌సిన్హా మాట్లాడుతూ, సాంకేతికతను జోడించడం ద్వారా నేరస్థుల అన్వేషణలో పోలీసులు మరింత వేగంగా స్పందించే అవకాశం ఉందన్నారు. కెమెరాల అనుసంధానంతో ట్రాఫిక్‌ నియంత్రణ మరింత మెరుగు పడుతుందన్నారు. అనంతరం ఎంపీ నిధులతో పోలీసు శాఖకు సమకూర్చిన స్కార్పియో వాహనాన్ని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రావణి, కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, కూటమి నాయకులు, పోలీసులు అధికారులు, సిబ్బంది అప్పారావు, సీఐలు ప్రేమ్‌కుమార్‌, వెంకటనారాయణ, అశోక్‌కుమార్‌, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 12:49 AM