నగరానికి క్రికెటర్లు
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:31 AM
స్థానిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరగనున్న వన్డే మ్యాచ్‌లో తలపడనున్న భారత్, దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు రాయ్‌పూర్ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు.
నేడు ప్రాక్టీస్
వన్డే మ్యాచ్ రేపు
విశాఖపట్నం స్పోర్ట్స్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
స్థానిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరగనున్న వన్డే మ్యాచ్‌లో తలపడనున్న భారత్, దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు రాయ్‌పూర్ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల్లో రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్లారు. శుక్రవారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సాధన చేయనున్నారు.
గవర్నర్ రాక రేపు
వన్డే మ్యాచ్‌ను వీక్షించనున్న అబ్దుల్ నజీర్
విశాఖపట్నం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల ఆరో తేదీన నగరానికి వస్తున్నారు. ఆయన శనివారం ఉదయం విజయవాడ నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి నోవాటెల్ హోటల్‌కు వెళ్లి బస చేస్తారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి పీఎం పాలెం స్టేడియానికి చేరుకుని, ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య వన్‌డే మ్యాచ్‌ను వీక్షిస్తారు. రాత్రి 10 గంటలకు తిరిగి హోటల్‌కు వెళతారు. ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ బయలుదేరి వెళతారు.
ఆరు ఇండిగో విమాన సర్వీసులు రద్దు
గోపాలపట్నం (విశాఖపట్నం), డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): దేశంలోని పలు ప్రాంతాల నుంచి గురువారం విశాఖపట్నం రావాల్సిన ఆరు ఇండిగో విమాన సర్వీసులను సాంకేతిక కారణాలతో రద్దు చేశారు. వీటిలో హైదరాబాద్-విశాఖ-హైదరాబాద్, బెంగళూరు-విశాఖ-బెంగళూరు, చెన్నై-విశాఖ-ముంబై, బెంగళూరు-విశాఖ-బెంగళూరు, కోల్‌కత్తా-విశాఖ-కోల్‌కత్తా, ఢిల్లీ-విశాఖ-ఢిల్లీ విమాన సర్వీసులు ఉన్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.