అప్పన్న సన్నిధిలో క్రికెటర్ శ్రీచరణి
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:24 AM
భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణి బుధవారం సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఏఈవో కె.తిరుమలేశ్వరరావు ఆహ్వానం పలికారు. క్రికెటర్ గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలుచేశారు.
సింహాచలం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణి బుధవారం సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఏఈవో కె.తిరుమలేశ్వరరావు ఆహ్వానం పలికారు. క్రికెటర్ గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలుచేశారు. కప్పస్తంభాన్ని ఆలింగనం, గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనాలివ్వగా, ఏఈఓ శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.