Share News

పీఎం సూర్యఘర్‌పై అవగాహన కల్పించండి

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:19 AM

ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి పీఎం సూర్యఘర్‌ పథకంపై ఐటీడీఏ పీవోలు, ఏపీ ఈపీడీసీఎల్‌, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పీఎం సూర్యఘర్‌ పథకంలో ఇంటి పైకప్పుపై సోలార్‌ విద్యుత్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుందన్నారు. వినియోగదారులు సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడం వలన విద్యుత్‌ పోతుందనే టెన్షన్‌ ఉండదన్నారు.

పీఎం సూర్యఘర్‌పై అవగాహన కల్పించండి
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

- అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి పీఎం సూర్యఘర్‌ పథకంపై ఐటీడీఏ పీవోలు, ఏపీ ఈపీడీసీఎల్‌, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పీఎం సూర్యఘర్‌ పథకంలో ఇంటి పైకప్పుపై సోలార్‌ విద్యుత్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుందన్నారు. వినియోగదారులు సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడం వలన విద్యుత్‌ పోతుందనే టెన్షన్‌ ఉండదన్నారు. పట్టణ, గ్రామీణ ప్రజలు సైతం సోలార్‌ ప్యానెల్స్‌కు అర్హులన్నారు. ఇంటి పైకప్పుపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడానికి స్థలం ఉన్న ప్రతి ఒక్కరూ పీఎం సూర్య ఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు ఎంజే అభిషేక్‌గౌడ, కట్టా సింహాచలం, అపూర్వ భరత్‌, ఏపీ ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ప్రసాద్‌, జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎల్‌.రజని, జిల్లాలోని 22 మండలాలకు చెందిన తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 12:19 AM