బైక్‌రేసింగ్‌లపై సీపీ దృష్టి
ABN , Publish Date - Mar 10 , 2025 | 12:52 AM
నగరంలో బైక్‌రేసింగ్‌లకు అడ్డుకట్టవేయడంపై సీసీ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు.
వారంతాల్లో ప్రత్యేక నిఘాకు ఆదేశం
వారంరోజుల్లో పట్టుబడిన 54 మంది రేసర్లు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
నగరంలో బైక్‌రేసింగ్‌లకు అడ్డుకట్టవేయడంపై సీసీ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు. వారంతాల్లోనే బైక్‌రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో ఆయారోజుల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో గతవారం రోజుల్లోనే 54 మంది రేసర్లు పోలీసులకు పట్టుబడడం పరిస్థితికి అద్దంపడుతోంది.
నగరంలో బైక్‌రేసింగ్‌లు తారస్థాయికి చేరుకున్నాయి. గతంలో నగరశివారు ప్రాంతాల్లో అకస్మాత్తుగా జరిగే రేసింగ్‌లు తాజాగా వారాంతాల్లో సాధారణంగా మారిపోయాయి. పైగా నగర శివారు ప్రాంతాలకు కాకుండా నగరం నడిబొడ్డునే రేసింగ్‌లు నిర్వహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నగరంలో రాత్రివేళ పరిస్థితిని పరిశీలించే ందుకు సీపీ శంఖబ్రతబాగ్చి అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో తిరిగారు. ఆ సమయంలో కొంతమంది యువకులు బీచ్‌రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సిరిపురం తదితర ప్రాంతాల్లో బైక్‌లతో రేసింగ్ నిర్వహించడం గుర్తించారు. దీంతో నగరంలో రేసింగ్‌లకు అడ్డుకట్టవేయాలని అధికారులను ఆదేశించారు. వారాంతాల్లో రేసింగ్‌లు జరుగుతున్నాయని, ఆయా రోజుల్లో నగరమంతా ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు.
రాత్రీ గస్తీతో ఫలితాలు
దీంతో నగరంలో పోలీసులు రాత్రివేళ, ప్రధానంగా వారంతాల్లో గస్తీ పెంచడంతో బైక్ రేసర్లు వరుసగా పట్టుబడుతున్నారు. ఈనెల రెండో తేదీన రాత్రి సమయంలో మానసిక ఆస్పత్రిరోడ్డులో బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించి 38 మంది రేసర్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు 38 ద్విచక్రవాహనాలను స్వాధీనం తీసుకున్నారు. అలాగే ఈనెల ఏడో తేదీన సిరిపురం కూడలి పరిసరాల్లో రేసింగ్ నిర్వహిస్తున్న మరో 18 మంది పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి బైక్‌లను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదుచేశారు. పట్టుబడిన యువకుల తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇలాంటి రేసింగ్‌లు నగరంలో బీచ్‌రోడ్డుతోపాటు బీఆర్‌టీఎస్‌రోడ్డు, మారికవలస నుంచి ఐటీ హిల్స్‌కు వెళ్లేరోడ్డు, రుషికొండ, తిమ్మాపురం బీచ్‌రోడ్డులో ఎప్పటికప్పుడు జరుగుతుంటాయని పోలీసులే చెబుతున్నారు.
వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం
రేసింగ్‌కు పాల్పడేవారంతా వాట్సాప్, ఇన్‌స్టాల్లో గ్రూపులుగా ఏర్పడి రేసింగ్ ఎక్కడ నిర్వహించేదీ సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుని పోలీసుల రాకను గమనించి జిగ్‌జాగ్‌లు, స్పీడ్ డ్రైవింగ్, స్టంట్‌లు వంటి వాటిపై పోటీలు పెట్టుకుంటున్నారు. ఆ సమయంలో అదే రోడ్డుపై వెళ్లే వాహనచోదకులు వారిని చూసి ఆందోళనకు గురై ప్రమాదాల బారిన పడిన సందర్భాలు కూడా ఉన్నాయని పోలీసులే చెబుతున్నారు. యువత ప్రాణాలను బలిగొంటున్న రేసింగ్‌లపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని నగరవాసులు కోరుతున్నారు.