Share News

జల్లులతో చల్లబడిన వాతావరణం

ABN , Publish Date - May 04 , 2025 | 12:47 AM

వాతావరణ మార్పుల ప్రభావంతో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా నగరంపై మబ్బులు కమ్మేశాయి.

జల్లులతో చల్లబడిన వాతావరణం

5, 6 తేదీల్లో ఉత్తరకోస్తాకు వర్షసూచన

విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):

వాతావరణ మార్పుల ప్రభావంతో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా నగరంపై మబ్బులు కమ్మేశాయి. సాయంత్రం వరకూ మేఘాలు ఉన్నాయి. నగరంలో చిన్నపాటి జల్లులు కురవగా, శివారు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో నగరవాసులు సేదతీరారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 5, 6 తేదీల్లో ఉత్తరకోస్తాలో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Updated Date - May 04 , 2025 | 12:47 AM