Share News

మహిళల ఆరోగ్య పరిరక్షణకు దోహదం

ABN , Publish Date - Sep 17 , 2025 | 01:03 AM

మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార ఫ్లెక్సీని, పోస్టర్లను మంగళవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, బుధవారం జిల్లాలోని 46 కేంద్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని,, అక్టోబరు రెండో తేదీ వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిబిరాల్లో వివిధ రకాల స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగిన వైద్య సదుపాయాన్ని అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వ్యాధులను ముందుగా గుర్తించి అవసరమైన ఆరోగ్య సేవలను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశమన్నారు.

మహిళల ఆరోగ్య పరిరక్షణకు దోహదం
ఫ్లెక్సీ, పోస్టర్లను ఆవిష్కరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి

అనకాపల్లి కలెక్టరేట్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార ఫ్లెక్సీని, పోస్టర్లను మంగళవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, బుధవారం జిల్లాలోని 46 కేంద్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని,, అక్టోబరు రెండో తేదీ వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిబిరాల్లో వివిధ రకాల స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగిన వైద్య సదుపాయాన్ని అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వ్యాధులను ముందుగా గుర్తించి అవసరమైన ఆరోగ్య సేవలను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశమన్నారు. బాలికలు, యువతులు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ హైమావతి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌దేవ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.వీరజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 01:03 AM