Share News

కొనసాగిన ముసురు

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:35 AM

జిల్లాలోని పలు మండలాల్లో గురువారం కూడా ముసురు వాతావరణం కొనసాగింది. అనకాపల్లి, మాడుగుల, గొలుగొండ మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. కశింకోట, మునగపాక, ఎలమంచిలి, మాకవరపాలెం, చోడవరం, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి.

కొనసాగిన ముసురు
రావికమతం మండలం కొమిరలో వరి విత్తనాలు చల్లుతున్న రైతులు

పలుమండలాల్లో తేలికపాటి జల్లులు

నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

అనకాపల్లి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో గురువారం కూడా ముసురు వాతావరణం కొనసాగింది. అనకాపల్లి, మాడుగుల, గొలుగొండ మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. కశింకోట, మునగపాక, ఎలమంచిలి, మాకవరపాలెం, చోడవరం, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. సాయంత్రం తరువాత వాతావరణం తెరిపిచ్చింది. కాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శుక్ర, శనివారాల్లో జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైతు వికాస కేంద్రాల్లో వరి విత్తనాలు పంపిణీ చేస్తుండడంతోపాటు రెండు రోజుల నుంచి చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆకుమడులు సిద్ధం చేసుకుని విత్తనాలు చల్లుతున్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:35 AM