కొనసాగుతున్న చలి తీవ్రత
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:12 AM
మన్యంలో క్రమంగా చలి పెరుగుతుండడంతో జనం వణుకుతున్నారు. వాతావరణంలో మార్పులతో గురువారం పొగమంచు దట్టంగానే కురిసింది.
జి.మాడుగులలో 5.2 డిగ్రీలు
వణుకుతున్న జనం
పాడేరు, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): మన్యంలో క్రమంగా చలి పెరుగుతుండడంతో జనం వణుకుతున్నారు. వాతావరణంలో మార్పులతో గురువారం పొగమంచు దట్టంగానే కురిసింది. దీంతో పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. తాజా వాతావరణం పర్యాటకులకు కనువిందు చేసేలా ఆహ్లాదకరంగా మారింది. దీంతో అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.
కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. జి.మాడుగులలో గురువారం 5.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, అరకులోయలో 5.9, చింతపల్లిలో 7.3, ముంచంగిపుట్టులో 7.7, పాడేరులో 8.7, పెదబయలులో 9.5, హుకుంపేటలో 10.1, కొయ్యూరులో 11.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.