నాణ్యతగా పేదల ఇళ్ల నిర్మాణం
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:34 AM
పేదల గృహ నిర్మాణాల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు సూచించారు. బుధవారం ఆయన అనకాపల్లి మండలం కుంచంగిలో ఎన్టీఆర్ పేదల కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల గృహాలు పూర్తిచేయాలని లక్ష్యం
గృహనిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు
కొత్తూరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పేదల గృహ నిర్మాణాల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు సూచించారు. బుధవారం ఆయన అనకాపల్లి మండలం కుంచంగిలో ఎన్టీఆర్ పేదల కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తాతయ్యబాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఈ నెల 15వ తేదీనాటికి రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకపోతే సంబంధిత కాంట్రాక్టర్లు, ఆయా పనులను పర్యవేక్షించే అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గడువులోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయని, నాణ్యత పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టామన్నారు. ఆయన వెంట హౌసింగ్ అధికారులతోఆపటు టీడీపీ నాయకులు పచ్చికూర రాము, పల్లెల నాగేశ్వరరావు, పోలిన జగ్గారావు, రొంగలి సూరిబాబు, వెంకటేశ్ ఉన్నారు.