ప్రజలతో మమేకం కండి
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:54 AM
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. శనివారం జిల్లాలోని తాళ్లపాలెం పంచాయతీ బంగారయ్యపేటలో ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమానికి హాజరైన అనంతరం తాళ్లపాలెం లేఅవుట్‌లో అనకాపల్లి నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
- అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలి
- అనకాపల్లి నియోజకవర్గ పార్టీ శ్రేణులతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
అనకాపల్లి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. శనివారం జిల్లాలోని తాళ్లపాలెం పంచాయతీ బంగారయ్యపేటలో ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమానికి హాజరైన అనంతరం తాళ్లపాలెం లేఅవుట్‌లో అనకాపల్లి నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు ప్రజలతో మమేకమవుతూ ఉండాలని, కార్యకర్తల మనోభీష్టం మేరకే ముందుకు వెళ్లాలని సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాలపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. సూపర్ సిక్స్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని, గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉన్నా, అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వం నిధుల కేటాయింపులు జరుపుతోందన్నారు. జనసేన, బీజేపీ నాయకులతో ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం సీఎం చంద్రబాబునాయుడు ప్రతి కార్యకర్తతో, గ్రామ, మండల, గ్రామ కమిటీలతో ఫొటోలు దిగారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవింద్ర, హోం మంత్రి వంగలపూడి అనిత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, డీసీఎంఎస్ చైౖర్మన్ కోట్ని బాలాజీ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, రత్నాకర్, అనకాపల్లి, కశింకోట మండలాల అధ్యక్షులు బాబీ, గొంతిన శ్రీను, తదితరులు పాల్గొన్నారు.