గందరగోళంగా టీచర్ల బదిలీల ప్రక్రియ
ABN , Publish Date - May 26 , 2025 | 12:28 AM
ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ గందరగోళంగా తయారైందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు విమర్శించారు.
ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు
నర్సీపట్నం, మే 25(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ గందరగోళంగా తయారైందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రేషనలైజేషన్‌తో ముడి పెట్టడం వల్ల టీచర్ల బదిలీల ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని అన్నారు. ఒకసారి రేషనలైజేషన్ అయిన తర్వాత కనీసం ఐదు సంవత్సరాల వరకు ఉపాధ్యాయులను కదపకూడదని అన్నారు. ఇలా అయితేనే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులకు అవకాశం ఉంటుందని అన్నారు. మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు రెండేళ్లకు రెండు పాయింట్లు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2021లో బదిలీపై వచ్చి 2025లో రేషనలైజేషన్ అయిన ఉపాధ్యాయులకు పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వాలన్నారు. బదిలీల ప్రక్రియ ఆన్‌లైన్‌లో తలెత్తిన సమస్యలన తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డీజీనాథ్, నేతలు కురచా వెంకటరమణ, జీపీఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.