బంగారు కుటుంబాల లక్ష్యాన్ని పూర్తి చేయండి
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:22 PM
బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేయడానికి అవసరమైన మార్గదర్శుల ఎంపిక త్వరతగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేయడానికి అవసరమైన మార్గదర్శుల ఎంపిక త్వరతగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర జీరో పావర్టీ (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్ షిప్)లో భాగంగా బంగారు కుటుంబాల మ్యాపింగ్‌పై మంగళవారం ఉదయం అమరావతి నుంచి సీఎం చంద్రబాబునాయుడు, అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనకాపల్లి నుంచి కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. అనంతరం ఆమె జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎంపిక చేసిన మార్గదర్శుల బంగారు కుటుంబాలకు మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఓ రామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.