Share News

జగన్‌పై గాజువాక పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:11 AM

పోలీసులపై అనుచిత వాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను అరెస్టు చేయాలంటూ తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ బుధవారం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులను కించపరిచేలా జగన్‌ మాట్లాడారని, ఇది పోలీసుల్లో విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తుందన్నారు.

జగన్‌పై గాజువాక పోలీసులకు ఫిర్యాదు
సీఐ పార్థపారథికి ఫిర్యాదు చేస్తున్న బీవీ రామ్‌

గాజువాక, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): పోలీసులపై అనుచిత వాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను అరెస్టు చేయాలంటూ తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ బుధవారం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులను కించపరిచేలా జగన్‌ మాట్లాడారని, ఇది పోలీసుల్లో విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తుందన్నారు. రాష్ట్రంలో పోలీసులు చట్ట ప్రకారం విధులు నిర్వహించడాన్ని జగన్‌ ఓర్వలేకపోతున్నారని, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రామ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యక్రమంలో పూర్ణచంద్రరావు, వెంకటేశ్వరరావు, సత్తిబాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:12 AM