Share News

హైవే బాధితులకు నష్టపరిహారాన్ని సత్వరమే చెల్లించాలి

ABN , Publish Date - May 18 , 2025 | 12:35 AM

జాతీయ రహదారి నిర్మాణంలో భూములను కోల్పోయిన బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించేందుకు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

హైవే బాధితులకు నష్టపరిహారాన్ని సత్వరమే చెల్లించాలి
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన జేసీ అభిషేక్‌గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, మే 17(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి నిర్మాణంలో భూములను కోల్పోయిన బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించేందుకు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి రెవెన్యూ, టూరిజం, జాతీయ రహదారి అఽథారిటీ అధికారులతో జాతీయ రహదారి నిర్మాణం, నష్టపరిహారం చెల్లింపులపై శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి నిర్మాణంలో అనుబంధంగా ఉన్న రహదారులు, తాగునీటి పథకాలు, నీటి పారుదల వనరులకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అలాగే నష్టపరిహారం చెల్లింపుల్లో లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రాధాన్యతా పరంగా చెల్లింపులు చేయాలన్నారు. పాడేరు - లగిశపల్లి, పాడేరు - కొయ్యూరు జాతీయ రహదారి నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, జాతీయ రహదారి అథారిటీ అధికారులు గుల్షన్‌కుమార్‌, రవిశేఖర్‌, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:35 AM