బార్క్ నిర్వాసితులకు నష్టపరిహారం
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:23 AM
బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని, జాబితాల్లో పేర్లు వున్న వారందరికీ వారంలోగా చెల్లింపులు ప్రారంభిస్తామని అనకాపల్లి ఆర్డీఓ షేక్ ఆయీషా తెలిపారు.
డి.పట్టా భూములకు ఎకరాకు రూ.20 లక్షలు
వారంలో చెల్లింపులు ప్రారంభం
అనకాపల్లి ఆర్డీవో షేక్ ఆయీషా
అచ్యుతాపురం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):
బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని, జాబితాల్లో పేర్లు వున్న వారందరికీ వారంలోగా చెల్లింపులు ప్రారంభిస్తామని అనకాపల్లి ఆర్డీఓ షేక్ ఆయీషా తెలిపారు. గురువారం దొప్పెర్ల, రావిపాలెం బార్క్ నిర్వాసితులతో ఆమె సమావేశమయ్యారు. అయితే తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారంతోపాటు పునరావాసం, ఉపాధి కల్పించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఇందుకు ఆర్డీఓ స్పందిస్తూ.. ఈ రెండు గ్రామాల్లో సేకరిస్తున్నది డి.పట్టా భూములు అయినందువల్ల ఆ చట్టం వర్తించదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సత్యనారాయణ, డీటీ శ్యామ్ కుమార్, నాయకులు కొరుప్రోలు చిన్నారావు, పల్లి శేషగిరిరావు, నర్మాల కుమార్, కొల్లి వరహాలరావు, కొల్లి సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.