కేజీహెచ్‌పై కలెక్టర్ దృష్టి
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:09 AM
కేజీహెచ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా కలెక్టర్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంతో పోలిస్తే రోగుల సంఖ్య గణనీయంగా పెరగడం, వార్డుల్లో పడకల సంఖ్య పెరగకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఆస్పత్రిలో సూపరింటెండెంట్, డిప్యూటీ కలెక్టర్, సీఎస్‌ఆర్‌ఎంవో మధ్య సమన్వయం లోపం కారణంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నట్టు కలెక్టర్ గుర్తించారంటున్నారు.
ఉన్నతాధికారుల మధ్య కొరవడిన సమన్వయం
ఇబ్బందిపడుతున్న ఉద్యోగులు
వార్డుల్లో నీటి సమస్య, క్షీణించిన పారిశుధ్యం
రెండు, మూడు రోజుల్లో
అధికారులతో ప్రత్యేక సమావేశం
విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా కలెక్టర్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంతో పోలిస్తే రోగుల సంఖ్య గణనీయంగా పెరగడం, వార్డుల్లో పడకల సంఖ్య పెరగకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఆస్పత్రిలో సూపరింటెండెంట్, డిప్యూటీ కలెక్టర్, సీఎస్‌ఆర్‌ఎంవో మధ్య సమన్వయం లోపం కారణంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నట్టు కలెక్టర్ గుర్తించారంటున్నారు. ఇంకా కొన్ని వార్డుల్లో నీటి సమస్య ఉంది. మరికొన్నిచోట్ల పారిశుధ్యం క్షీణించింది. బాత్‌రూమ్‌లు అధ్వానంగా ఉండడంతో రోగులు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఎన్ని హెచ్చరికలు జారీచేస్తున్నా కొన్నిచోట్ల వసూళ్ల వ్యవహారానికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. వార్డు బాయ్‌లు, గైనిక్ విభాగంలో కిందిస్థాయి సిబ్బంది డబ్బుల కోసం రోగులను పీక్కుతింటున్నారు. వీటన్నింటిపై కేజీహెచ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కలెక్టర్ నిర్ణయించారు.