కేజీహెచ్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Apr 10 , 2025 | 01:08 AM
జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ బుధవారం కేజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం ఆస్పత్రికి వెళ్లిన ఆయన పలు విభాగాలకు వెళ్లి, అక్కడ అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఓపీ కౌంటర్ ద్వారా అందుతున్న సేవలను పర్యవేక్షించారు.

రోగులకు అందుతున్న సేవలపై ఆరా
మహారాణిపేట, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ బుధవారం కేజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం ఆస్పత్రికి వెళ్లిన ఆయన పలు విభాగాలకు వెళ్లి, అక్కడ అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఓపీ కౌంటర్ ద్వారా అందుతున్న సేవలను పర్యవేక్షించారు. ఓపీ టోకెన్ తీసుకునేందుకు ఎంతసేపు నిరీక్షించాల్సి వస్తోంది?, అభయ్ యాప్ ద్వారా ఓపీ టోకెన్‌ల జారీ, హెల్ప్ డెస్క్ సిబ్బంది సహకరిస్తున్నారా? లేదా?, అక్కడ సదుపాయాలు, ఇతర అంశాలపై పలువురు రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుతున్నాయా? లేదా? అంటూ వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్, ఆర్‌ఎంవో డాక్టర్ మెహర్‌కుమార్ రోగులకు అందిస్తున్న సేవలను కలెక్టర్‌కు వివరించారు.