Share News

కలెక్టర్‌కు ఆది కర్మయోగి ఉత్తమ ఫెర్ఫార్మెన్స్‌ అవార్డు

ABN , Publish Date - Oct 17 , 2025 | 10:57 PM

జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆది కర్మయోగి యోజన ఉత్తమ ఫెర్ఫార్మెన్స్‌ అవార్డును శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.

కలెక్టర్‌కు ఆది కర్మయోగి ఉత్తమ ఫెర్ఫార్మెన్స్‌ అవార్డు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డు అందుకుంటున్న కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా

అవార్డును అందుకున్న దినేశ్‌కుమార్‌

పాడేరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆది కర్మయోగి యోజన ఉత్తమ ఫెర్ఫార్మెన్స్‌ అవార్డును శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. గ్రామ స్థాయిలో నాయకత్వ లక్షణాలు పెంపు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అయితే దేశ వ్యాప్తంగా ఆది కర్మయోగి యోజన అమలు తీరుతెన్నులపై శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈక్రమంలో ఆది కర్మయోగి అమలులో జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ చూపడంతో ఆయనకు ఉత్తమ ఫెర్ఫార్మెన్స్‌ అవార్డును రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆది కర్మయోగి యోజనలో జిల్లాకు అవార్డు దక్కడంపై ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 17 , 2025 | 10:57 PM